

 
భారతదేశపు నాలుగవ మొగలాయి చక్రవర్తి జహంగీర్. ఇతను అక్బర్ కుమారుడు. 1605లో జహంగీర్ పరిపాలన ప్రారంభమయింది. 
జహంగీర్ కాలంలో పోర్చుగీసువారితో వర్తకవ్యాపారాలు అభివృద్ధి చెందాయి. దేశం కూడా ఆర్థికంగా అభివృద్ధి సాధించింది. న్యాయపాలనకు, కళాపోషణకు, మతసహనానికి పేరుపొందాడు.
జహంగీర్ భార్య నూర్జహాన్. ఇతని చిన్నప్పటి ప్రియురాలు. వీరి వివాహానికి అక్బర్ సమ్మతించకపోవటంతో, అక్బర్ మరణానంతరం ఈమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే నూర్జహాన్ కు వివాహమై ఒక కుమార్తె కూడా ఉంది. 
నూర్జహాన్ స్వతహాగా తెలివితేటలు కలది. తన బంధువర్గాన్ని రాజపరివారంలో చేర్చుకుని నెమ్మదిగా జహంగీర్ నుండి  అధికారమంతా చేచిక్కించుకుంది. పేరుకు జహంగీర్ చక్రవర్తే గానీ, పెత్తనమంతా నూర్జహాన్ దే. కానీ సమర్థవంతంగా పరిపాలన సాగించింది. జహంగీర్ ను నెమ్మదిగా తాగుడుకు బానిసను చేసింది.